కూతురును వేధించవద్దన్న తల్లిని లారీ కిందకు తోశారు

Woman trapped under lorry
గుంటూరు/విజయవాడ: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురును వేధించవద్దని హెచ్చరించినందుకు ఓ మహిళను కొందరు దుండగులు లారీ కింద తోసేసిన సంఘటన జిల్లాలోని తెనాలిలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుజాత అనే మహిళ తన కూతురుతో కలిసి మార్కెట్‌కు వెళ్లారు.

వారు గాంధీ చక్ వద్దకు వచ్చినప్పుడు కొందరు దుండగులు కూతురును వేధించారు. తల్లీకూతుళ్లు భయపడ్డారు. కూతురును ఏమైనా అంటారేమోననే ఆందోళనతో తన కూతురును వేధించవద్దని వారిని హెచ్చరించింది. మద్యం మత్తులో ఉన్న దుండగులు తల్లిని అటుగా వస్తున్న లారీ కింద తోసేశారు.

దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తల్లిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కూతురు బిటెక్ చదువుతోంది. తల్లి మరణ వార్త విని కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఈవ్ టీజింగ్ కేసులో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. రాత్రి నలుగురిని, ఉదయం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితులు ఈవ్ టీజింగ్ చేస్తున్నప్పుడు ఓ పోలీసు అక్కడే ఉన్నారని, పోలీసుల నిర్లక్ష్యమే తన తల్లి ప్రాణాన్ని బలిగొందని మృతురాలి కూతురు మౌనిక ఆరోపిస్తున్నారు. కాగా ఈ కేసులో కీలక ఏడో నిందితుడు ఓ నేత తనయుడుగా చెబుతున్నారు. అందుకే ఆయనను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

రైళ్లో దొంగతనం

పద్మావతి ఎక్సుప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు మహిళా ప్రయాణీకుల మెడల్లోని బంగారు గొలుసులను ఎత్తుకుపోయారు. వేకువజామున మూడున్నర గంటల ప్రాంతంలో రైలు ఒంగోలు సమీపంలో ఉన్నప్పుడు ప్రయాణీకులు నిద్రలో ఉండగా ఇది జరిగింది. బాధితులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లురు జిల్లాలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విజయవాడలో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు

కృష్ణా జిల్లా విజయవాడలోని గొల్లపూడి కొత్త మార్కెట్ యార్డులో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఇందులో మూడు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+