జగన్ పార్టీలోకి లగడపాటి సన్నిహితుడు అడుసుమిల్లి?

లగడపాటికి సన్నిహితుడు అయిన ఇతను మరో సన్నిహితుడి సలహా మేరకు జగన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్ పేరు ప్రచారంలో ఉంది. ఇతనికి అడుసుమిల్లి సన్నిహితుడు. పొట్లూరి సూచనల మేరకే అతను జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.
ఒకప్పుడు నాదెండ్ల భాస్కర రావుకు అనుచరుడుగా ఉన్న జయప్రకాశ్... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆయనతో పాటే పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1983లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. 1994 నుంచి అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా, 1999 నుంచి 2004 వరకు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.
టిడిపి నుంచి నాదెండ్ల బయటకు వచ్చాక కొన్నాళ్లు తటస్థంగా ఉన్న జయప్రకాశ్ తిరిగి ఎన్నికల సమయంలో హరికృష్ణ ద్వారా టిడిపిలో చేరారు. అప్పట్లో టిడిపి, బిజెపిల పొత్తు నేపథ్యంలో తూర్పు నియోజకవర్గాన్ని బిజెపికి వదిలేయవలసి వచ్చింది. దీంతో పార్టీపై అలిగి జయప్రకాశ్ బయటకు వచ్చారు. తర్వాత కాంగ్రెస్ అభిమానిగా ఉన్నారు. కొంతకాలంగా లగడపాటి శిబిరంలో కీలక వ్యక్తిగా కొనసాగుతూ సమైక్యవాదిగా తన వాదనను వినిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications