మోసం చేశారు: అధిష్టానానికి ఎంపి రాజయ్య అల్టిమేటం

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు దేనికీ భయపడరని అన్నారు. 2009 డిసెంబర్ 9వ తేదిన పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఇస్తామని కేంద్రం చెప్పిందని, ఈ హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని ఆయన చెప్పారు.
తెలంగాణ అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయమని అలాంటప్పుడు దేశం మొత్తంలో అందరి అభిప్రాయం అవసరం లేదని చెప్పారు. గతంలో భువనగిరి సభలో కూడా సోనియా తెలంగాణ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలిపారన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇవ్వని పక్షంలో తాను ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
తెలంగాణ ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకు ఇవ్వలేదని, తాము ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల వద్దకు పోవాలన్నారు. తెలంగాణ ఇవ్వని పక్షంలో తాము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అలాకాకుండా పార్టీని కాపాడుకోవాలంటే మాత్రం తెలంగాణ ఇవ్వాల్సిందే అన్నారు. తన ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు తాను నడుచుకుంటానని చెప్పారు. పార్టీని వీడే అంశంపై ఆయన స్పందించలేదు. అయితే తెరాసలోకి వెళ్లే విషయాన్ని ఆయన ఖండించలేదు.












Click it and Unblock the Notifications