డిల్లీలో మరో కీచకపర్వం: బస్సులో బాలికపై రేప్

స్వీట్స్ ఇస్తానని ఆశపెట్టి డ్రైవర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని 47 ఏళ్ల రాకేష్ కౌశల్‌గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన గురించి బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. బాలిక ఆదివారంనాడు విపరీతంగా ఏడుస్తుండడంతో తల్లి కారణం అడిగింది. దాంతో ఆమె తనపై జరిగిన అత్యాచారం గురించి వివరించింది.
తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను స్వీట్లు ఇస్తానని ఆశ పెట్టి కౌశల్ ఆమెను బస్సులోకి తీసుకుని వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత బస్సులో ఆమెపై అత్యాచారానికి దిగాడు. బాలిక చెప్పిన వివరాలతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బస్సులో సామాహిక అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని 13 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసిన విషయం తెలిసిందే. డిసింబర్ 29వ తేదీన ఆమె సింగపూర్ ఆస్పత్రిలో ప్రాణఆలు విడిచింది.












Click it and Unblock the Notifications