'జగన్‌పై ఎదురుదాడి ఇలాకాదు: అందరు ప్లాన్ చేయాలి'

జగన్ పైన కాంగ్రెసు పార్టీ నేతలు ఎవరికి వారు విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. మరికొందరు వైయస్‌ను కూడా టార్గెట్ చేసుకుంటుండగా ఇంకొందరు మౌనం దాల్చుతున్నారు. కొందరు నేతలు సమాధానాలు దాట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమోస్ మంగళవారం మాట్లాడుతూ... 2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్ దోపిడీని ప్రజలకు వివరించేందుకు ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
జగన్ అవినీతి పైన మంత్రులు తలోరీతిన మాట్లాడటం సరైంది కాదన్నారు. మంత్రులంతా సమావేశమై ఒకే వైఖరిని రూపొందించుకోవాలని సూచించారు. కాంగ్రెసు శాసనసభా పక్షం, పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యమని ఆమోస్ చెప్పారు. పార్టీని వీడే వారు వీడవచ్చునని, ప్రక్షాళణ చేసే అవకాశం వస్తుందన్నారు.
2014లోపే తెలంగాణపై ప్రకటన: సర్వే
తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీని మారితే అవకాశవాదులుగా మిగిలిపోతారని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ వేరుగా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణను ఏర్పాటు చేస్తారన్నారు. జగన్‌ను చంచల్‌గూడ జైలులో ఉంచినందుకే దర్బార్ నడుపుతున్నారని, తీహార్ జైలులో ఉంచి ఉంటే ఈ హంగామా ఉండేది కాదన్నారు. ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చేస్తుందన్న వాదనలో పస లేదన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications