వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాపై కేసు

సత్యనారాయణపురంలోని 342, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. తనను వంగవీటి రాధాకృష్ణ నిర్బంధించారని, హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆనంద రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.
కాగా, కృష్ణా జిల్లా విజయవాడ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. అంతకుముందు ఆయన కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు అందులో చేరారు. 2009 సాధారణ ఎన్నికల్లో పిఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడం, జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించడంతో వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన ఫ్లెక్సీల రాజకీయాలకు కూడా తెరలేపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications