కిరణ్‌కి చిరు పొగడ్త, జగన్‌కి తెగడ్త: బోట్ నడిపి హల్‌చల్

Chiranjeevi
రాజమండ్రి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి పని తీరు బాగుందని, పథకాలు తన మనసును తాకాయని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో నిర్మించే స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఉప్పాడ కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన హైస్కూల్ భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు, కౌలు రైతులకు హామీలేని రుణాల వంటి పథకాలు తనకెంతో నచ్చాయన్నారు. మహిళలు సగర్వంగా తలెత్తుకునే పథకం 'బంగారు తల్లి' అని, అది తన మనసును తాకిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కిరణ్ చొరవ వల్లే వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్రంలోనే ఈ పథకం ప్రవేశ పెట్టారన్నారు.

ఇన్ని పథకాలు సమర్థంగా అమలు చేస్తూ కిరణ్బాగా పని చేస్తున్నారని, తాను కాంగ్రెస్‌లో ఉన్నందుకు గర్విస్తున్నాని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. హత్య కంటే ఆర్థిక నేరాలు అత్యంత ప్రమాదకరమని, అటువంటి ఆర్థిక నేరాలు చేసి కటకటాల పాలైన వారిని ప్రజలు విశ్వసించరని తెలిపారు. కర్నాటక రాష్ట్రంలో ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా బిజెపిని చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు.

బోటు షికారు

కోరంగి అభయారణ్య ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగి పంచాయతీ పరిధిలోని కోరంగి అభయారణ్యంలో రూ.4 కోట్లతో చేపట్టే ఎకో టూరిజమ్ రిసార్ట్స్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బోటు షికారు చేశారు. స్వయంగా టూరిజం స్పీడు బోటును నడుపుకుంటూ చిరంజీవి అభయారణ్యాన్ని వీక్షించారు. బోటులో మంత్రులు వట్టి వసంత కుమార్, విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+