ఉస్మానియాలో తెలంగాణ కోసం యువకుడు ఆత్మహత్య

విషయం తెలియడంతో విశ్వవిద్యాలయ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. అతను తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు చెబుతున్నారు.
తుపాకి పేలి కానిస్టేబుల్ మృతి
అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ప్రమాదవశాత్తు ఓ తుపాకి పేలింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బుల్లప్ప మృతి చెందాడు.
ప్రమాదంలో ముగ్గురు మృతి
అదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం కలమడుగు బ్రిడ్జి పైన సోమవారం తెల్లవారుజామున కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పైన వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం గోశాల నుండి అక్రమంగా తరలిస్తున్న 12 కోడెదూడలను చినగదిలి వద్ద స్థానికులు పట్టుకున్నారు వాటిని అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications