నేతల పోరు: వివాదాస్పద అసెంబ్లీ స్థానాలపై బాబు దృష్టి

జూలైలో బస్సు యాత్ర మొదలు పెట్టేలోపు ఇందులో కొన్నైనా తేల్చాలన్న ఉద్దేశంలో ఉన్న ఆయన ఆయా నియోజకవర్గాల నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. మహానాడు పూర్తి కావడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఇంఛార్జులు పని చేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఇంఛార్జులను ఖరారు చేయాల్సి ఉంది.
నేతల మధ్య పోటీ నెలకొనడం.. సరైన అభ్యర్థి దొరకకపోవడం వంటి కారణాలతో ఎంపిక వాయిదా పడుతోంది. నేతల మధ్య పోటీ ఉన్న నియోజకవర్గాల వారిని ముందుగా పిలిపించి వారి అభిప్రాయాలను విని రెండు మూడు దఫాల చర్చల్లో తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. మొదటగా గురువారం జూబ్లీహిల్స్, అంబర్‌పేట నేతలను పిలిపించి మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాధ్, అంబర్‌పేటలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పార్టీ పరిశీలనలో ఉన్నారు. వారిని ఆ నియోజకవర్గాల్లో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందరికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరితో మరోసారి మాట్లాడాలని నగర ఇన్‌చార్జి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు సూచించారు.












Click it and Unblock the Notifications