వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో నేతల ఇళ్ల చుట్టు కెసిఆర్: పెద్దిరెడ్డి

ఒకప్పుడు తెలంగాణకు చెన్నారెడ్డి, వెంకట స్వామిలు మోసం చేస్తే, ఇప్పుడు కెసిఆర్, కాకా తనయులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస నేత కెసిఆర్ ప్రాంతీయ వాదానికంటే వలసలకే ప్రాధాన్యం ఇస్తున్నార్ననారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టిక్కెట్లకు ఇతర పార్టీల నేతలు కావాలా... ఇదేనా ఉద్యమ స్ఫూర్తి అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ నిజంగా తెలంగాణను కోరుకుంటే టిడిపితో కలిసి రావాలన్నారు.
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఊరూరా విగ్రహాలు పెడతామని, జేబులో ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతామని పెద్దిరెడ్డి అన్నారు. తెరాసలోకి వెళ్లేవారంతా పదవుల కోసమే వెళ్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే జెఏసి కింద స్వతంత్ర ఉద్యమానికి కెసిఆర్ సిద్ధం కావాలన్నారు.
అధిష్టానం నాతో మాట్లాడింది: వివేక్
కాంగ్రెసు పార్టీ పెద్దలు తనతో మాట్లాడారని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని వారు సూచించారని, తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తాను ఆలోచిస్తానని అన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను సాయంత్రం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. రాజయ్య సహా అందరం తెరాసలోకి వెళ్తామని మంద జగన్నాథం అన్నారు. కాంగ్రెసును వీడటం బాధాకరమే అయినా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తప్పడం లేదన్నారు.
తెరాసలో చేరను: రాజయ్య
తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే ప్రసక్తి లేదని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటూనే తాను ప్రత్యేక రాష్ట్రం కోసం చివరిదాకా పోరాడుతానన్నారు. తనకు తెరాస నుండి ఆహ్వానం అందిందని కానీ, కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications