కెటిఆర్ కోట్ల సెటిల్మెంట్స్‌పై ఆంధ్రజ్యోతి Vs టిఆర్ఎస్

దీనిపై తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎబిఎన్ కథనంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒక వ్యక్తిని కావాలని టార్గెట్ చేస్తున్నారని, వాటిని నిరూపించాలని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సవాల్ విసిరారు. నిరూపిస్తే పార్టీ పరంగా తాము ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు. రాధాకృష్ణ తీరు కొండను తవ్వి ఎలుకను తీసినట్లుగా ఉందన్నారు. ఉద్యమ నేతలను కళంకితులను చేయడం ద్వారా, ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
వాటిన తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాధాకృష్ణ చరిత్ర తెలియనిదెవరికన్నారు. వాస్తవం లేని కథనం ప్రచారం సరికాదన్నారు. రేపు తెలంగాణ వచ్చాక వారి ఛానల్, పేపర్‌ను తెలంగాణ ప్రజలు బహిష్కరిస్తారన్నారు. గతంలో ప్రజలు ఆవేశకావేశాలకు లోనయ్యేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కొంతకాలం కెసిఆర్‌ను, ఆ తర్వాత హరీష్ రావు, ఇప్పుడు కెటిఆర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
గతంలో ఓ నిర్మాత మనువడు డ్రగ్స్ వాడుతున్నారంటు అసత్య కథనాలు ప్రసారం చేస్తే కేసు నమోదు కాలేదా అని ప్రశ్నించారు. కెటిఆర్ పైన అసత్య కథనాలు ప్రసారం చేసిన రాధాకృష్ణను తాము కోర్టుకు లాగుతామన్నారు. ఆయన ఆధారాలు చూపాలన్నారు. మరోవైపు కెటిఆర్ పైన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై పలువురు తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లతో వారికేం పని అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications