2వసారి: ముంబై జైళ్లో అబూ సలేంపై తోటిఖైదీ కాల్పులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో 1993లో జరిగిన బాంబు పేలుళ్ల కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్ అబూ సలేం పైన తోటి ఖైదీ కాల్పులు జరిపాడు. అబూ సలేం ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఓ న్యాయవాది హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవేంద్ర జగ్‌తప్.. అబూ సలేం పైన ఒక రౌండ్ కాల్చాడు.

దీంతో అబూ సలేం చేతికి తీవ్ర గాయమైంది. నిందితుడు ఓ రౌండ్ కాల్చడంతో సలేంకు గాయమైందని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. జగ్‌తప్‌కు తుపాకీ ఎలా లభ్యమైందన్న విషయంపై విచారణ చేస్తున్నామన్నారు.
అబూ సలేం పైన ఇలా దాడి జరగడం రెండోసారి. పోర్చుగల్ నుంచి 2005లో భారత్ తీసుకొచ్చిన అనంతరం 2010లో ఆర్థర్‌రోడ్ జైలులో ఉన్నపుడు.. తోటి ఖైదీ చేతిలో అబూ సలేం దాడికి గురయ్యాడు. మళ్లీ ఇపుడు రెండోసారి తోటి ఖైదీ చేతిలో కాల్పులకు గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications