పడవ బోల్తా: మోహన్ బాబుకు తప్పిన ప్రమాదం

ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం జూన్ 21న వారు, మోహన్ బాబు దంపతులు బ్యాంకాక్ వెళ్లారు. శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో షూటింగ్ చూసుకొని మోహన్ బాబు, ఆయన సతీమణి ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వస్తున్నారు. వారు ఓ పడవలో బయలుదేరారు.
ఈ సమయంలో పడవ కొద్దిదూరం వెళ్లగానే బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన జాలర్లు వారిని రక్షించారు. విడిది కేంద్రానికి చేర్చారు. పడవ బోల్తా పడటంతో జాలర్లు వారిని రక్షించడంతో మోహన్ బాబు దంపతులకు పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలియగానే మంచు మనోష్, విష్ణు, ఇతర నటులు వారి వద్దకు చేరుకున్నారు.
ఈ ఘటనలో మోహన్ బాబుకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. దీంతో చిత్రం షూటింగు కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా మరోవైపు ప్రమాదం సమయంలో విష్ణు, మనోజ్‌లు అక్కడే ఉన్నారని, జాలర్లతో పాటు వారు నీళ్లలోకి తమ తల్లిదండ్రులను రక్షించేందుకు దూకారనే వార్తలు కూడా వస్తున్నాయి.












Click it and Unblock the Notifications