విభజిస్తే రాజీనామా: రాయపాటి, రెచ్చగొడ్తున్నారు: కిషన్

రెచ్చగొడుతున్నారు: కిషన్ రెడ్డి
వారం రోజుల్లో, పది రోజుల్లో తెలంగాణపై తేల్చేస్తామని చెప్పి కాంగ్రెసు పార్టీ ప్రజలను రెచ్చగొడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. తెలంగాణపై తేల్చేస్తామన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. విభజన, సమైక్యవాద సభలకు అనుమతించిన దిగ్విజయ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికలు బహిష్కరిస్తేనే తెలంగాణ: గద్దర్
తెలంగాణ ఉద్యమానికి ఎన్నికలతో సంబంధం పెట్టవద్దని, ఎన్నికలను బహిష్కరిస్తేనే తెలంగాణ సాధ్యమని ప్రజా యుద్ధ నౌక గద్దర్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణ ద్రోహులకు ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ప్రాంతాల మధ్య చిచ్చురేపడానికే రాయల తెలంగాణ అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని గద్దర్ డిమాండ్ చేశారు.
12న కోర్ కమిటీ
కాగా ఈ నెల 12వ తేదిన కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశం కావొచ్చని ఉప ముఖ్యమంత్రి దామోదర నరసింహ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నారని భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications