తెలంగాణ ఇస్తే కొత్త రాష్ట్రాల డిమాండ్లకు రెక్కలు

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బుందేల్‌ఖండ్ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. యుపిలోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని 12 జిల్లాలలతో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బుందేల్‌ఖండ్ ముక్తి మోర్చా డిమాండ్ చేస్తోంది. యుపి నుంచి విడదీసి పుర్వాంచల్, బుందేల్‌ఖండ్, హరితప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తాము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఎస్పీ అధినేత మాయావతి డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రాంతాల్లో ఉద్యమాలు పెరుగుతాయని భావిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌కు, తెలంగాణకు మధ్య సామ్యం ఉందని బుందేల్‌ఖండ్ ముక్తి మోర్చా చాలా కాలంగా అంటోంది. పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చాలా కాలంగా నలుగుతోంది. కొంత మేరకు స్వయంప్రతిపత్తి ఇస్తూ మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూర్ఖా ప్రాదేశిక పాలనావ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో గూర్ఖా జనముక్తి మోర్చా ఉద్యమాన్ని విస్తరిస్తూనే ఉంది.
బోడో లాండ్ డిమాండ్ కూడా ఉంది. వీటన్నింటికి తోడు విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చాలా కాలంగా ఉంది. నాగపూర్ రాజధానిగా విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమం నడుస్తోంది. దేశంలో దాదాపు 20 - 25 ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఉద్యమాలకు మరోసారి ఊపిరి పోసినట్లవుతుందనే ఆందోళన కాంగ్రెసు అధిష్టానంలో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications