సిటీలో ఫేక్ మ్యారేజ్ బ్యూరో: మహిళ సహా ఇద్దరి అరెస్ట్

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భాస్కర రావు ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. ఫతేనగర్‌లో ఉంటూ ఓ కంపెనీలో చేరాడు. ఇదే సమయంలో అతనికి కృష్ణా జిల్లాకు చెందిన నిర్మలతో పరిచయం అయింది. తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వీరిద్దరు కలిసి లేట్ మ్యారేజెస్ బ్యూరోను స్థాపించారు.
ఓ నకిలీ మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేసి దిన పత్రికలలో క్లాసిఫైడ్స్ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో సంబంధాలు వెతికి పెడతామని, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద రూ.5వేలు డిపాజిట్ చేయాలని చెప్పేవారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ఓపెన్ చేసిన అకౌంట్ నెంబర్ ఇచ్చేవారు.
డబ్బు డిపాజిట్ చేసిన వారితో వారం, పదిరోజులు మాట్లాడి ఆ తర్వాత ఫోన్ నెంబర్ మార్చేసేవారు. దీని కోసం భాస్కర రావు తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఒక్కొక్కరి నుండి రూ.2 వేల నుండి రూ.5వేల వరకు వసూలు చేశారు. దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు.












Click it and Unblock the Notifications