ఫొటోలు: నితీష్ కుమార్‌కు తాకిడి మీద తాకిడి

పాట్నా: కొద్ది నెలల వరకు అభివృద్ధికి నమూనా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలనలో నడుస్తున్న బీహార్‌ను చెప్పుకుంటూ వచ్చారు. అయితే, గత నెల రోజులుగా నితీష్ కుమార్‌కు తాకిడి మీద తాకిడి తగులుతోంది. జూన్ 12వ తేదీన మావోయిస్టులు రైలుపై దాడి చేసిననప్పటి నుంచి వరుసగా బీహార్‌ను కుదిపేసే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మావోయిస్టులు రైలును అటవీ ప్రాంతంలో ఆపేసి దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఆ తర్వాత బుద్ధగయ పేలుళ్లు నితీష్ కుమార్ ప్రభుత్వానికి దిగ్భ్రాంతికి గురి చేశాయి. జులై 7వ తేదీన జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినా బుద్ధగయలోని ఆలయంలో పేలుళ్లు సంభవించడం ఆందోళనకు కారణమైంది.

ఛాప్రాలో ఈ వారం మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు అస్వస్థతకు గురై 27 మంది మరణించడం తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది. బడిలో మధ్యాహ్న భోజనం ఆరగించిన పిల్లలు మృత్యువాత పడడం సమాజానికి కలచివేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీ జెడి(యు) ఎన్డీయేతో తన 17 ఏళ్ల బంధాన్ని జూన్ 16వ తేదీన తెంపేసుకుంది.

పేలుళ్లలో గాయపడిన బౌద్ధ భిక్షువు

ఇటీవల బుద్ధగయలోని మహాబోధీ ఆలయంలో వరుసగా తొమ్మిది బాంబు పేలుళ్లు సంభవించాయి. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ఈ ఆలయం ఉగ్రవాదుల దాడికి గురి కావడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుళ్లలో ఇద్దరు బౌద్ధ భిక్షువులు గాయపడ్డారు.

స్నిఫర్ డాగ్స్‌తో సెక్యూరిటీ సిబ్బంది

బుద్ధగయ మహాబోధి ఆలయంలో బాంబు పేలుళ్లు సంభవించిన తర్వాత స్నిఫర్ డాగ్స్‌తో సెక్యూరిటీ సిబ్బంది ఇలా..

బాంబు డిస్బోజల్ స్క్వాడ్

బుద్ధగయలోని హోటల్ వద్ద పేలని బాంబును నిర్వీర్యం చేసిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్

అస్వస్థతకు గురైన బిడ్డతో ఇలా..

చాప్రా జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆరగించి అస్వస్థతకు గురైన బిడ్డను ఆస్పత్రిలో ఇలా ఎత్తుకుని ఓ వ్యక్తి..

మిడ్డే మీల్స్‌పై గుర్రు

పాట్నాలోని మధ్యాహ్న భోజనం కార్యాలయం వద్ద ఎఐఎస్ఎ, ఎఐపిడబ్ల్యుఎ కార్యకర్తలు ఇలా...

మిడ్డే మీల్స్ బాధితుల కుటుంబ సభ్యులు

మధ్యాహ్న భోజనం తిన్న బాధితుల కుటుంబ సభ్యులు కంటికి మింటికీ ఏకధారగా రోదిస్తూ ఇలా...

జమూయిలో...

ఇటీవల జమాయి జిల్లోలని కుంధార్ వద్ద మావోయిస్టులు ధన్‌బాద్ - పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడి చేశారు. ఆ రైలులోని ప్రయాణికులు ఇలా..

బిజెపితో తెగదెంపులు చేసుకుంటూ ఇలా..

ఎన్డియేతో, బిజెపితో 17 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ ఇలా..

నితీష్, శరద్ ఇలా..

పాట్నాలో శానససభ్యులు, పార్లమెంటు సభ్యులతో సమావేశమైన నితీష్ కుమార్, జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+