వర్షంలో జంటగా వాక్, గొడుగు పట్టిన మహిళ (పిక్చర్స్)
బెంగళూరు/హైదరాబాద్: దక్షిణ భారత దేశంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరట్వాడా, అండమాన్ నికోబర్ దీవులు, మధ్య మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జమ్ము కాశ్మీర్, తూర్పు మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తుఫాను, వర్షం కురుస్తోంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిషా, ఉత్తరాంధ్ర, ఈశాన్య రాష్ట్రాల్లోను వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, కర్నాటక తీర ప్రాంతం, కేరళ, అండమాన్ నికోబర్ దీవుల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శబరిమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు వెళ్లే వాహనాలు ఇరవై కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మన రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నిండిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా చీకుపల్లి వాగుపై పది అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. తాలిపేరులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. వరంగలర్ జిల్లా రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. అదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.

భారీ వర్షాల కారణంగా నాగాలాండు రాష్ట్రంలోని దిమాపూర్‌లోని ఓ ప్రాంతంలో వీధుల్లోనే నీరు చేరిన దృశ్యం. దీనిని దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

చిన్నగా చినుకులు వస్తుండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంట మీద వర్షం పడకుండా గొడుకు పట్టుకున్న దృశ్యం

భారీగా కురుస్తున్న వర్షంలోనే ఓ జంట రోడ్డు దాటుతున్న దృశ్యం. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోనిది.












Click it and Unblock the Notifications