వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనూ తాగుతా, తప్పేంటి: గండ్ర, ఎవరెంత తాగారో..: వర్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkataramana Reddy - Varla Ramaiah
హైదరాబాద్/విజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పు కనిపించలేదని ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి శుక్రవారం అన్నారు. తనకు కూడా మద్యం అలవాటుందని, దాంట్లో తప్పేముందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల బ్రాందేయవాది అన్నందుకే బొత్స మద్యం వ్యాఖ్యలు చేశారన్నారు. అందులో తప్పు కనిపించలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రయివేటు యాజమాన్యాల లబ్ధి కోసమే ఫీజు దీక్షను చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు.

ఎవరెంత తాగారో...: వర్ల

ఎవరెంత తాగారో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య విమర్శించారు. బ్రదర్ అనిల్ కుమార్ ఏం తప్పు చేశారో బొత్స బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఖద్దరు మాటున కాంగ్రెసు నేతలు గాంధీ వారసలమని చెప్పుకోవడం మానుకోవాలన్నారు.

అర్హత లేదు: రాజేంద్ర ప్రసాద్

తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసులకు పంచాయతీ ఎన్నికలలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని టిడిపి నేత రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలంగాణ జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కాలేదన్నారు. తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకే వారు ఏకగ్రీవాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలను భ్రష్టు పట్టించిన ఆ రెండు పార్టీలకు ఓటు వేయవద్దని ఆయన కోరారు. కళంకితుల్లో ప్రథముడు పార్థసారథిని తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై స్పీకర్

English summary

 Government chief whip Gandra Venkataramana Reddy said that there is no wrong in PCC chief Botsa Satyanarayana's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X