వారి పెత్తనం: కోదండరాం, లీకులతో గందరగోళం: కవిత

ఇదంతా సాగదీసేందుకేనన్నారు. తెలంగాణ ఇస్తే దేశ సమగ్రత దెబ్బతింటుందని, నక్సల్స్ సమస్య పెరుగుతుందని సీమాంధ్ర నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా చెప్పలేదన్నారు.
పూటకో లీకు.. రోజుకో మాట
కాంగ్రెసు గత రెండు నెలలుగా తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పూటకో లీకులిస్తున్నారని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోజుకో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. లీకులు, అబద్దాలతో తెలంగాణను అడ్డుకోలేరన్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా బొత్స, కిరణ్ మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు స్పందించడం లేదన్నారు. తెలంగాణ మంత్రులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడే కాంగ్రెసును నమ్ముతామన్నారు.












Click it and Unblock the Notifications