ముందే సమైక్య సభ: శైలజానాథ్, వైయస్‌పై బాబు ఫైర్

సిడబ్ల్యూసిలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అంతకు రెండు రోజుల ముందే తాము అనంతపురంలో సమైక్య సభను నిర్వహిస్తామన్నారు. తద్వారా సమైక్య వాదన వినిపిస్తామన్నారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ముమ్మాటికి సమైక్యవాది అని ఆయన చెప్పారు.
వైయస్‌పై బాబు ఫైర్
పంచాయతీకి తమ హయాంలో 64 అధికారాలు అప్పగిస్తే, కాంగ్రెసు అధికారంలోకి వచ్చాక నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 54 వెనక్కి తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గ్రామ సర్పంచులకు కాంగ్రెసు పార్టీ అధికారాలను తగ్గించిందన్నారు.
ఎన్నికలంటే కాంగ్రెసుకు భయం పట్టుకుందన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించింది టిడిపియే అన్నారు. మహిళా, బిసి రిజర్వేషన్లను తామే కల్పించామన్నారు. గ్రామాల్లో సుపరిపాలన కోసం సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో నిజాయితీపరులనే ఎన్నుకోవాలని బాబు ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications