భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య మానస కిడ్నీలు ఫెయిల్ కావడంతో గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ఉదయం మృతి చెందింది. విషయం తెలుసుకున్న భర్త కృష్ణం రాజు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. అతను ప్రకాశం బ్యారేజీ వద్ద ద్విచక్ర వాహనంపై నుండి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
వైద్యం వికటించి గర్భిణి మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం ఉదయం వైద్యం వికటించి గర్భిణీ మృతి చెందింది. దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
కొడుకు మృతిని తట్టుకోలేక..
కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకొన్న ఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రంలో చోటు చేసుకొంది. పొంగిపొర్లుతున్న గొట్టిముక్కల వాగును చూసేందుకు వెళ్లిన హరీష్ తిరిగి వస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరణవార్త తెలుసుకొన్న హరీష్ తల్లి కమల మనస్తాపానికి గురై, దోమకొండలోని కుడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది.












Click it and Unblock the Notifications