భార్య గీతాంజలి మృతి: జ్యూడిషియల్ మెజిస్ట్రేట్‌కి సంకెళ్లు

కానీ పోస్టుమార్టం నివేదికలో మాత్రం గీతాంజలిది ఆత్మహత్య కాదని హత్య అని తేలింది. దీంతో రవనీత్ గార్గ్ తన హోదాను ఉపయోగించి కేసును మాఫీ చేయిస్తారని అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రవనీత్ గార్గ్, గీతాంజలి గార్గ్‌లకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగ పిల్లాడిని కనలేదని కుటుంబ సభ్యులు తరుచూ వేధించేవారని గీతాంజలి తల్లిదండ్రులు, సోదరుడు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గీతాంజలి హత్య కేసులో పోలీసులు రవనీత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) దర్యాఫ్తు చేయనుంది. రవనీత్ గార్గ్‌ను సిట్ బృందం ఇప్పటికే ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications