రక్తపోటుతో సంజయ్‌దత్: ఎరవాడ జైల్లోనే వైద్య పరీక్షలు

సంజయ్ దత్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని మెడికల్ సూపరింటెండెంట్ కులకర్ణి చెప్పారు. సంజయ్‌కు దాదాపు రెండు నెలల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. సంజయ్ దత్‌తో పాటు ఆయనతో పాటు అదే జైలులో ఉన్న స్నేహితుడు యూసుఫ్ నల్వాలాకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన పలు ఆనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తెలిసిందని అధికారులు చెప్పారు.
కాగా 1993 అల్లర్ల కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అంతకుముందు టాడా కోర్టు అతనికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సుప్రీం కోర్టు దానిని ఐదేళ్లకు తగ్గించింది. దీంతో అతను ఇటీవల కోర్టు ఎదుట లొంగిపోయారు. అతనిని ఎరవాడ జైలుకు తరలించారు.
మొదట ఆర్ధర్ రోడ్డులో ఉంచారు. ఆనంతరం అతనిని ఎరవాడ జైలుకు తరలించారు. గతంలో విచారణ ఖైదీగా ఏడాదిన్నర జైలు శిక్షను అనుభవించాడు. దీంతో ఇతను మరో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంది.












Click it and Unblock the Notifications