జగన్‌పార్టీ కనుచూపుమేరలో లేదు: బొత్స, బాబుపై ఫైర్

పంచాయతీల్లో ఏకగ్రీవం అయిన వాటిలో ఎక్కువ శాతం కాంగ్రెసు మద్దతుదారులవే అన్నారు. చంద్రబాబు మాత్రం తామే ఎక్కువ సర్పంచులను ఏకగ్రీవం చేసుకున్నట్లుగా చెప్పుకుంటున్నారన్నారు. చంద్రబాబు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారని విమర్శించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా బాబు వైఖరి ఉంటుందన్నారు.
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అన్నారు. కాంగ్రెసు పార్టీయే బలోపేతం చేసిందని తెలుసుకోవాలన్నారు. వాస్తవాలను వక్రీకరించడం టిడిపికి అలవాటే అన్నారు. చంద్రబాబు మాటల మనిషి కాదని, చేతల మనిషి అన్నారు. తాము చాలాకాలంగా రాజకీయాల్లో ఉంటున్నామని, రాజకీయ భిక్ష వ్యాఖ్యలకు సమాధానంగా చెప్పారు.
భారీ వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఉత్తర తెలంగాణలో అధిక నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలు చేస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. వర్షాల వల్ల 12 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications