జగన్నాథ రథంపై విదేశీ నర్తకి: అర్చకుడి మొట్టికాయ
పూరీ: జగన్నాథుని నందనీ ఘోష్ రథయాత్రలో తనపై ఆలయ అర్చకులు దాడికి దిగారంటూ ఒడిస్సీ నృత్యకారణి ఇలియానా సిటారిస్టి ఆరోపించారు. పూరీ దేవస్థాన సేవాయత్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించిందని ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు పాలక మండలి ఫిర్యాదను స్వీకరించారు.
ఇటలీకి చెందిన ఈమె ఒడిశా సంప్రదాయ నృత్యం ఒడిస్సీ నిష్ణాతురాలు. ఇలియానా జన్మతః ఇటలీ దేశస్థురాలు. ఒడిస్సీ నృత్యంపై ప్రేమతో ఒడిషానే తన స్వస్థలంగా చేసుకున్నారు. చాలాకాలంగా ఆమె ఇక్కడే ఉంటున్నారు. దేశానికి వన్నెతెచ్చిన నృత్యకారిణిగా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

ఇప్పుడు ఈమె అర్చకులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆదివారం ఆమె జగన్నాథుడిని దర్శించుకునేందుకు పూరీ వచ్చారు. అందరితో కలిసి రథం పైకి వెళ్లిన ఆమెను గమనించిన సేవాయత్... జగన్నాథుడిని తాకేందుకు రూ.వెయ్యి ఇవ్వాలని పట్టుబట్టారని ఆమె ఆరోపించారు.
తాను, తన శిష్యురాలు జగన్నాథ రథం పైకి వెళ్లాలనుకున్నామని, ఇందుకు రూ.20 విరాళంగా చెల్లించి పైకి వెళ్లామని, దేవుడికి మరికాస్త దగ్గరకు వెళ్లాలనుకుంటే.. అందుకు అక్కడి అర్చకుడు రూ.1000 అడిగాడని, తాము నిరాకరిస్తే ఆయన తమను తీవ్రంగా అవమానించాడని, తలపై బలంగా మోదాడని ఆమె ఫిర్యాదు చేశారు. తన తలపై అతను మూడుసార్లు కొట్టాడని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications