హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్, ఆంధ్ర: రెండు రాష్ట్రాల పేర్లపైనా గొడవ?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Names for 2 states can cause new row
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల పేర్లపైనా గొడవ జరిగే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. సీమాంధ్ర, రాయల తెలంగాణ అనే పదాలను మీడియా ముందుకు తెచ్చింది. దాంతో అవి ప్రచారంలోకి వచ్చాయి. వాటినే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వాడింది.

అధికార కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు తుది నిర్ణయం తీసుకుని, యుపిఎ ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించిన వెంటనే రాష్ట్రాల పేర్లపై కసరత్తు చేయవచ్చునని అంటున్నారు. రాష్ట్రం పేరు విషయంలో కూడా తెలంగాణవాదులు ఆంధ్ర పాలకవర్గాలను నిందిస్తున్నారు. విలీనం జరిగినప్పుడు రాష్ట్రం పేరులో తెలంగాణను తొలగించడాన్ని ఆధిపత్య ధోరణిగా వారు విమర్శిస్తున్నారు.

హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు 1956లో విలీనమైన తర్వాత ఏర్పడిన రాష్ట్రం పేరులో తెలంగాణ అనే పదం లేకుండా జాగ్రత్త పడ్డారని వారంటున్నారు. నిజానికి, రాష్ట్రం పేరు తెలంగాణాంధ్ర ప్రదేశ్ అని అనుకున్నారని, చివరి నిమిషంలో తెలంగాణ పదాన్ని తొలగించారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు విమర్శిస్తున్నారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ జిల్లాలతో కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి రాయల తెలంగాణ పేరును అంగీకరించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా లేరని అంటున్నారు. రాయల అనే పదం పట్ల వారు తీవ్ర అభ్యంతరం పెట్టే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంగా నామకరణం చేయాలంటే మిగతా రెండు జిల్లాల నాయకులు అంగీకరించకపోవచ్చు. హైదరాబాద్ రాష్ట్రంగా నామకరణం చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. అయితే, దానివల్ల నిజాం పాలన గుర్తుకు వచ్చే అవకాశాలున్నాయని, దాని వల్ల బిజెపి లాభపడడానికి చూస్తుందని కాంగ్రెసు నాయకత్వం అనుకుంటుందని చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడైతే, పది జిల్లాలతో కూడిన రాష్ట్రమే కావాలని, 1956లో ఏ ప్రాంతాలనైతే ఆంధ్ర రాష్ట్రంలో కలిపారో ఆ ప్రాంతాలతోనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దానికి తెలంగాణ రాష్ట్రం అనే నామకరణం ఉంటుందని మానసికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ, తెలంగాణ పదం వల్ల తెరాస ప్రయోజనం పొందవచ్చుననే అనుమానాలు కాంగ్రెసు అధిష్టానానికి ఉన్నాయని అంటున్నారు.

ఆంధ్రప్రాంతంతో రాయలసీమకు చెందిన చిత్తూరు, కడప జిల్లాలను కలిపితే ఏర్పడే రాష్ట్రానికి రాయల ఆంధ్రగా పేరు పెట్టవచ్చునని అంటున్నారు. నిజానికి ఆంధ్ర రాష్ట్రం అనే పేరు ఖాయం చేస్తారని అనుకుంటున్నారు. కానీ, పేర్లు మార్చే అవకాశాలు లేకపోలేదనే మాట వినిపిస్తోంది.

English summary
Naming the two new states in case AP is bifurcated will be a tricky affair. The two names, Seemandhra and Rayala Telangana popularised by the media, have been mentioned in Justice Srikrishna Committee report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X