కెవిపి సహా 7గురు ఎంపీలు రాజీనామా, ఎమ్మెల్యేలూ..

నలుగురు కేంద్ర మంత్రులు పళ్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, జెడి శీలం, కిల్లి కృపారాణిలు కూడా ఉదయమే రాజీనామా చేస్తారని భావించారు. అయితే వారు సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు.
ఎమ్మెల్యేల రాజీనామా
రాష్ట్రం విషయానికి వస్తే పలువురు టిడిపి, కాంగ్రెసు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామాలు చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కాంగ్రెసు ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట టిడిపి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణలు రాజీనామాలు ఫ్యాక్స్ చేశారు. ఆమంచి కృష్ణమోహన్(చీరాల), జోగేశ్వర రావు (మండపేట) రామకృష్ణ(వెంకటగిరి), కెఈ కృష్ణమూర్తి(డోన్)లు కూడా అదే దారిలో నడిచారు. విప్, ఎమ్మెల్యే ద్రోణంరాజు, మంత్రులు మహీధర్ రెడ్డి, విశ్వరూప్‌లు తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందించారు.
ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, మదుసూధన్, దాసరి బాలవర్ధన రావు, కెఈ ప్రభాకర్‌లు రాజీనామా బాట పట్టారు. కాంగ్రెసు పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలమంతా రాజీనామాకు సిద్దంగా ఉన్నామని ముత్యాల పాప అన్నారు.












Click it and Unblock the Notifications