ఆంధ్ర ఉద్యోగులు పోవాల్సిందే, ఆప్షన్లు లేవు: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనని, ప్రత్యామ్నాయాలు లేవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆయన శుక్రవారం తెలంగాణ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. అన్యాయంగా తెలంగాణలోని ఉద్యోగాలను ఆక్రమించుకున్నవారిని మాత్రమే బాగో అన్నామని, తన ప్రకటనను వక్రీకరించారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యోగులపై దారుణంగా దాడులు జరిగాయని ఆయన చెప్పారు. ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోతే తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయని చెప్పారు.

తెలంగాణ ఉద్యోగుల సకల జనుల సమ్మె ప్రపంచంలోనే అపురూపమైందని అన్నారు. పండుగలు, పబ్బాలు వదులుకుని తెలంగాణ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఉంటాయని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అన్నారు.

తనను దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని, తనను మానసికంగా క్షోభకు గురి చేశారని చెప్పారు. అయినా తాను సహించానని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లువంటివి ఇప్పటికీ పెండింగులో పడ్డాయని, అందువల్ల బిల్లు ఆమోదం పొందేవరకు నమ్మడానికి లేదని ఆయన అన్నారు. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత అంబరాన్నంటే సంబరాలు చేసుకుందామని కెసిఆర్ చెప్పారు.

తెలంగాణ తెచ్చుకుంటామని నమ్మకం తమకు ఉందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆ విశ్వాసంతో ప్రజలు ఉండాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చే విషయంలో బాధ్యతను మరిచిపోకూడదని ఆయన అన్నారు. జయశంకర్ జయంతిని ఈ నెల 6వ తేదీన తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+