4న ఢిల్లీకి కెసిఆర్: కాంగ్రెసు తెరాస విలీనానికి రెడీ?

కృతజ్ఞతలు తెలపడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నప్పటికీ విలీనంపై కూడా చర్చలు జరిపే అవకాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారికి కెసిఆర్ సూత్రప్రాయంగా తెలియజేస్తారని తెలిసింది. అయితే తమ పార్టీ విలీనం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే ఉంటుందని కెసిఆర్ వారికి చెప్పే అవకాశాలున్నట్లు సమాచారం.
అలాగే కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ప్రక్రియను వేగవంతం చేయాలని కెసిఆర్ కోరనున్నారని తెలిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, కెసిఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేసేందుకు పావులు కదపనున్నారని తెరాస వర్గాల సమాచారం.
విజయశాంతిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తెరాసకు ఆయన ఒక్కరే పార్లమెంటు సభ్యుడిగా మిగిలారు. ఢిల్లీలో ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించిన జాతీయ నాయకులను కూడా కలిసే అవకాశాలున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications