డ్రామాలొద్దు: కృపారాణి, పురంధేశ్వరికి సమైక్యవాదులు

పురంధేశ్వరి, కిల్లి కృపారాణిల ఇళ్లను వారు ముట్టడించారు. రాజీనామాలు చేసే వరకు వారిని సీమాంధ్రలో అడుగుపెట్టనివ్వమన్నారు. రాజీనామాలు చేయకుండా వారు వస్తే తాము విశాఖపట్నం విమానాశ్రయంలోనే అడ్డుకుంటామని హెచ్చరించారు.
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
తమ హక్కులు కాపాడాలంటూ సచివాలయంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహానికి భద్రత కల్పించలేని వారు తమకేం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. అభద్రతా భావంతోనే యూపిఏ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తమకు అన్యాయం జరుగుతుందనే భయంతోనే బయటకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నారు.
యువకుడి ఆత్మహత్య
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సకోడురులో శ్రీనివాస్ అనే యువకుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమవరంలో మృతదేహంతో ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications