జయలలితను బెదరగొట్టిన గున్న ఏనుగు కావేరి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను రెండు రోజుల క్రితం చిన్న గున్న ఏనుగు బెదరగొట్టింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను దూరంగా తీసుకు పోయారు. జయ ముదుమలై పులుల శరణాలయానికి వెళ్లారు. ఆమె అక్కడున్న ఏనుగులను చూశారు.
అక్కడ కావేరి, కామాక్షి, ముత్తు తదితర పద్దెనిమిది ఏనుగులు ఉన్నాయి. ముదుమైలకు వచ్చినప్పుడల్లా జయలలిత అక్కడున్న ఏనుగులకు పెట్టేందుకు బెల్లం, చెరుకు, అరటి పండ్లను తీసుకు వస్తుంటారు. వాటిని స్వయంగా గజరాజులకు తినిపిస్తుంటారు కూడా.
ఈసారి కూడా ఆమె అలాగే తీసుకు వచ్చింది. అక్కడే ఓ చిన్న గున్న ఏనుగు కావేరి ఉంది. దానిని చూసి ముచ్చటపడిన జయలలిత దానిని ప్రేమతో నిమురుతూ బెల్లం, అరటిపండ్లు తినిపించారు. తినిపిస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది, అధికారులు ఇతరులు గుమికుడారు.
దీంతో ఆ ఏనుగు కాస్త బెదిరింది. ఒక్కసారిగా కావేరి బెదరడంతో జయలలితతో సహా అక్కడున్న వారు ఆందోళన పడ్డారు. జయ పక్కకు తుళ్లి పడబోయారు. అయితే ఆమెను వెంటనే భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత జయ చిరునవ్వుతో ముదుమలై శరణాలయాన్ని చుట్టివచ్చారు.













Click it and Unblock the Notifications