బెదిరింపు లేఖ: ఫాంహౌస్‌లో కెసిఆర్, భద్రత కట్టుదిట్టం

ఫాంహౌస్‌కు పదిహేను కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కెసిఆర్‌ను కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు లోనికి అనుమతించడం లేదు. అధినేత అనుమతిస్తేనే అనుమతిస్తున్నారు. దాదాపు అరవై మంది సిబ్బంది అనుక్షణం కాపలా కాస్తున్నారు.
విచారణ జరపాలి: శంకర రావు
కెసిఆర్‌కు వచ్చిన బెదిరింపు లేఖ పైన విచారణ జరిపించాలని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విలేకరుల సమావేశంలో కోరారు. కెసిఆర్‌కు తగిన రక్షణ కల్పించాలన్నారు.
కాగా, కెసిఆర్‌ను పది రోజుల్లో చంపేస్తామంటూ సోమవారం ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రా నక్సల్ పేరుతో బెదిరింపు లేఖ వచ్చినట్లు పార్టీ కార్యాలయం సోమవారం రాత్రి వెల్లడించింది. ఈ లేఖ సాయంత్రం తమ కార్యాలయానికి తపాల శాఖ ద్వారా చేరినట్లు పేర్కొంది. అయితే ఎవరు? ఎక్కడి? నుంచి ఈ లేఖను పంపించారనే వివరాలు అందులో లేవని చెప్పారు. ఈ లేఖ సీల్డ్ కవర్‌లో వచ్చింది. కాన్ఫిడెన్షియల్, అర్జంట్ అంటూ లేఖ పైన మార్క్ చేశారు.












Click it and Unblock the Notifications