సీమాంధ్రను నియంత్రించాల్సిందే: కిరణ్‌కు అధిష్టానం

సీమాంధ్ర ఉద్యమాన్ని నియంత్రించడానికి ముఖ్యమంత్రి గురువారంనాడు కొంత సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో చర్చించారు. మంత్రులు పితాని సత్యనారాయణ, విశ్వరూప్ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా, వారికి దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు తోడయ్యారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని అధిష్టానం నుంచి ప్రకటన వస్తే తప్ప ఉద్యమం ఆగదని సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం. ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, రాజకీయ నాయకుల మద్దతు లేకుండానే వారు ఆందోళనలు సాగిస్తున్నారని వారు చెప్పినట్లు తెలుస్తోంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని నవంబర్ 1వ తేదీలోగా ప్రకటన రాకపోతే రాజీనామా చేస్తానని విశ్వరూప్ చేసిన ప్రకటనపై కిరణ్ కుమార్ రెడ్డి వివరణ అడిగినట్లు తెలుస్తోంది. తాను తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1వ తేదీలోగా సమైక్యాంధ్ర ప్రకటన రాకపోతే 2వ తేదీన రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం సాధ్యం కాకపోతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, లేదా హైదరాబాద్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రితో అన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. బుధవారంనాడు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోశయ్యను కలిశారు. తన మనవరాలి పెళ్లి కోసం రోశయ్య హైదరాబాద్ వచ్చారు.












Click it and Unblock the Notifications