వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకి బహిష్కరణ, బాబుకు మరణశిక్ష: జయప్రకాశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Adusumilli Jayaprakash
విజయవాడ/హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించి దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని దేశం నుంచి బహిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అడుసుమిల్లి జయప్రకాశ్ ఆదివారం డిమాండ్ చేశారు. విభజనను సమర్థించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన హత్యానేరం కింద కేసు నమోదు చేసి మరణదండన విధించాలని కూడా డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు 258 మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారని, ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో రగులుతున్న విద్వేషాలకు సోనియా, బాబు ఇద్దరూ కారణమని స్పష్టం చేశారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండేల పైనా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నందుకు కేసులు నమోదు చేసి శిక్షించాలన్నారు.

జగన్ పార్టీపై గండ్ర ఫైర్

జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావటం లేదని, ఆ పార్టీ ప్రవర్తన బట్టి దాని పేరు వైయస్సార్ కాంగ్రెసు కాదని, ఎజిపి (అయోమయం, గందరగోళం పార్టీ)గా పిలవాలని ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా జగన్ పార్టీ దీక్షలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు.

ఇప్పటికే తెలంగాణలో ఆ అడ్రస్సు లేకుండా పోయిందని, సీమాంధ్రలో కూడా ఆ పార్టీకి గడ్డు కాలం తప్పదన్నారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలే తప్ప వివాదాలు సృష్టించవద్దన్నారు. విభజనకు అనుకూలమంటూ లేఖ ఇచ్చిన వారు కూడా ఇప్పుడు యాత్రలు చేస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు.

English summary
Former MLA and YSR Congress Party leader Adusumilli Jayaprakash lashed out at TDP chief Nara Chandrababu Naidu and AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X