ఆ దమ్ములేదా?: కేంద్ర మంత్రులకు ఉద్యోగుల నిలదీత

ఈ సమయంలో అశోక్ బాబు ఆధ్వర్యంలో ఎపిఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులు వారిని నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగారు. సీమాంధ్ర నేతలు అందరూ రాజీనామా చేయకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. అందరికీ సమన్యాయం అంటే పార్లమెంటులో బిల్లు పెట్టాక చేసేదేముందని ప్రశ్నించారు. మీ అసమర్థత వల్లనే ఈ దుస్థితి వచ్చిందని వారు నిప్పులు చెరిగారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే విప్ వద్దని కోరడం దివాళాకోరుతనమే అవుతుందన్నారు. మీకు రాష్ట్రం, రాష్ట్ర సమస్యల పైన అవగాహన లేదని ఆరోపించారు. సమైక్యాంధ్రపై మంత్రులకు, ఎంపీలకు చిత్తశుద్ధి లేదని అందుకే రాజీనామా చేయడం లేదన్నారు. విభజన నిర్ణయం జరిగిపోయిందన్న ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నోరు మూయించే దమ్ము లేదా అని, విభజన ఖాయమంటున్న ఆంటోని కమిటీ వల్ల లాభమేమిటని ఘాటుగా ప్రశ్నించారు.
కాటసానికి లబ్బి సంఘీభావం
సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు జిల్లాలో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దీక్షకు లబ్బి వెంకటస్వామి సంఘీభావం తెలిపారు. మరోవైపు, హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిజిపితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications