ప్రభువు బతికిస్తాడని శవానికి వారం పాటు ప్రార్థనలు

ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే తరలించారు. తమ ప్రభువు తమ తనయుడిని తిరిగి బతిస్తాడనే విశ్వాసంతోనే తాము రోజు ప్రార్థనలు చేస్తున్నామని వారు చెప్పినట్లుగా సమాచారం. కాగా, ఇలాంటి మూఢ నమ్మకాల పట్ల ప్రజలను జాగృతం చేయాలని కోరుతున్నారు.
కొడుకును చంపిన తండ్రి
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం నలకదొడ్డిలో భార్యపై కోపంతో ఓ తండ్రి తన తనయుడిని చంపేశాడు. ఏడేళ్ల బాలుడిని హతమార్చిన తండ్రి మూటకట్టి ఓచోట పాతి పెట్టాడు. గ్రామస్థులకు విషయం తెలిసి దీనిని బయటపెట్టారు. పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
ఎంపి ఇంట్లో అగ్ని ప్రమాదం
ఎంపి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స ఝాన్సీ ఢిల్లీ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications