వైఎస్ వర్ధంతి: విజయమ్మకి షర్మిల ఓదార్పు (ఫొటోలు)

హైదరాబాద్/కడప: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలో ఆయనకు స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రుద్రరాజు పద్మరాజు తదితరులు సోమవారం నివాళులు అర్పించారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో కూడా నివాళులు అర్పించారు.

కుటుంబం నివాళి

వైయస్ నాలుగో వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు వైయస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. విజయమ్మ ఘాట్ వద్ద కంటతడి పెట్టుకున్నారు. అనంతరం షర్మిల సమైక్య శంఖారావం కోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరారు.

నాదెండ్ల

నాదెండ్ల

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు.

విజయమ్మ 1

విజయమ్మ 1

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల.

విజయమ్మ

విజయమ్మ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల. విజయమ్మను ఓదార్చుతున్న షర్మిల.

షర్మిల ప్రచారం రథం

షర్మిల ప్రచారం రథం

ఇడుపులపాయలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం షర్మిల సమైక్య శంఖారావం కోసం చిత్తూరు వెళ్లారు. ఆమె ప్రచారం రథం దృశ్యం.

దానం

దానం

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మంత్రి దానం నాగేందర్, కెవిపి.

రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే భావనతో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పరిపాలించారని ఎంపి సబ్బం హరి విశాఖలో అన్నారు. అందుకే ఆయన చనిపోయి నాలుగేళ్లైనా దేశవ్యాప్తంగా అనేక సేవాకార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. విశాఖలోని 72 వార్డుల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర సమైక్యత కోసమే వైయస్ జగన్మోహన్ రెడ్డి దృఢ నిర్ణయం తీసుకున్నారని, విభజన నిర్ణయాన్ని ప్రజలంతా తిప్పు కొట్టాలన్నారు.

కాగా, వైయస్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యాలయాల్లో వైయస్‌కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ సీనియర్ నేతలు పలువరు రక్తదానం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+