మరో నాలుగైదు రోజులు నిమ్స్‌లో వైయస్ జగన్!

జగన్‌ను చంచల్‌గూడ జైలు నుంచి తొలుత ఉస్మానియా ఆసుపత్రికి, ఆ తర్వాత నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లోనే ఆయనకు వైద్యులు ఐబి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆదివారం ఆయన బిపి, షుగర్ సాధారణ స్థాయికి చేరుకున్నాయని, కీటోన్స్ సంఖ్య కూడా తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.
ఆహారం తీసుకోడానికి మాత్రం కొంత సమయం పడుతుందని పేర్కొంటున్నారు. త్వరగానే కోలుకున్నా, చంచల్‌గూడ జైలులో తదుపరి చికిత్స కొనసాగించే అవకాశమున్నా మరో ఐదు రోజులపాటు నిమ్స్‌లోనే ఉంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం జగన్‌కు చికిత్స అందిస్తున్న వైద్య బృందంలో నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి శేషగిరి రావు, నెఫ్రాలజీ చీఫ్ శ్రీభూషణ్ రాజుతోపాటు పలువురు జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన వారున్నారు. మరో రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ నరేంద్ర నాథ్ తెలిపారు. ఆదివారం ఆయన జగన్‌ను పరిశీలించారు.
మరోవైపు జగన్‌కు సహాయంగా ఉండేందుకు వచ్చిన భారతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సహాయంగా ఉండేందుకు ఆసుపత్రికి రానున్నారు.












Click it and Unblock the Notifications