ఆటో బంద్ ఐతే!: చేత బ్యాగ్, దానిపై చిన్నారి (పిక్చర్స్)
హైదరాబాద్: ఆటో కార్మికులు గురువారం ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 108 జివోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ అధికారులు ఆటో డ్రైవర్లతో చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయి. దీంతో రేపు రవాణా శాఖ కార్యాలయం, ఎల్లుండి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆటో రిక్షాల సంఘాలు హెచ్చరించాయి. 108 జివోను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు.
తమపై విధిస్తున్న 108 జివోను రద్దు చేయాలని కోరుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా బుధవారం మహాత్మ గాంధీ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. డ్రైవర్ల ఆకారణంగా ఈ చాలన్లు, చాలన్ల పేరుతో వేధిస్తున్నారని, వెంటనే 108 జీఓను రద్దు చేయాలని యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది.
ఆటో బంద్ కారణంగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. సికింద్రాబాద్‌లో ఆటోలు తిరగలేదు. నగరంలో ఉన్న దాదాపు 70,000 రోడ్ల పైకి ఎక్కలేదు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘిస్తే రూ.1000 రూపాయల ఫైన్ వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటో డ్రైవర్లు ఆక్షేపించారు. మరోవైపు, బుధవారం ఆటోలు బందు కావడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఉదయం చేరుకున్న ప్రయాణికులు ఆటోల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ఆటోల ధర్నాకారణంగా ప్రయాణికులు ఆర్టీసీ, ప్రవేట్ బస్సుల్ని ఆశ్రయించారు. ఉదయం 10 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు దాదాపు పది ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్లు, పాస్ట్‌ప్యాసింజర్లలో వచ్చిన ప్రయాణికులు మధ్నాహ్యం వరకు తీవ్ర ఇబ్బదులు పడ్డారు. కార్యాలయాలకు ఆటోలలో వెళ్లే ఉద్యోగులు బస్సులను, కార్లను ఆశ్రయించారు.

ఓ ప్రయాణీకురాలి నిరీక్షణ
బుధవారం ఆటో రిక్షాల బంద్ కారణంగా సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు కోసం నిరీక్షిస్తున్న ఓ ప్రయాణీకురాలు.

అంతా ఖాళీ!
ఆటో రిక్షాల బంద్ కారణంగా బుధవారం సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ ఆటో స్టాండు వద్ద ఆటోలు లేక వెలవెలపోతున్న దృశ్యం. ఇక్కడ నిత్యం ఆటోల రద్దీ ఉంటుంది.

కార్మికుల ఆందోళన
సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ వద్ద బుధవారం జివో 108 పైన నిరసన వ్యక్తం చేస్తున్న ఆటో రిక్షా కార్మికులు. బుధవారం ఆటో బంద్ నిర్వహించారు.

ఆందోళన
సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ వద్ద బుధవారం జివో 108 పైన నిరసన వ్యక్తం చేస్తున్న ఆటో రిక్షా కార్మికులు. బుధవారం ఆటో బంద్ నిర్వహించారు.

ప్రయాణీకుల ఇబ్బందులు
బుధవారం ఆటో రిక్షాల బంద్ కారణంగా సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు

బస్సు కోసం పరుగులు
ఆటో రిక్షాల బంద్ కారణంగా బుధవారం సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ దగ్గర బస్‌స్టాండులలో ప్రయాణీకులు బస్సుల కోసం ఎదురు చూస్తున్న, వచ్చిన బస్సులను ఎక్కేందుకు ఆరాటపడుతున్న దృశ్యం.

సుమో ప్రయాణం
బుధవారం ఆటో రిక్షాల బంద్ కారణంగా సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో లేకపోవడంతో సుమో ప్రయాణం.

చేతిలో బ్యాగు, బ్యాగుపై చిన్నారి
బుధవారం ఆటో రిక్షాల బంద్ కారణంగా సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ ప్రయాణీకుడు బ్యాగును లాక్కొస్తూ దానిపై చిన్నారిని కూర్చోబెట్టిన దృశ్యం.












Click it and Unblock the Notifications