బాబు, విజయమ్మ మాట మార్చారు: డికె అరుణ

ఏపీ ఎన్జీవోలు మళ్ళీ మిలియన్ మార్చ్ పెడతామని అనడం సరికాదని అన్నారు. ఈనెల 7న ఏపీ ఎన్జీవోలు ఎల్బీస్టేడియంలో నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రలు హాజరుకాలేదని అరుణ విమర్శించారు. వచ్చే సాధారణ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని అరుణ అన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ వెనక్కిపోదని ఆమె తెలిపారు. తెలంగాణ మంత్రులమంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, సీమాంధ్ర మంత్రులతో చర్చిస్తామని అన్నారు. నీటి సమస్యలు, విద్యుత్ సమస్యలకు చర్చలతో పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు అపోహలకు గురికావొద్దు అని డీకే అరుణ అన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కె. చంద్రశేఖర రావు, హరీష్ రావు, ఈటెల రాజేందర్, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు. తెలంగాణవాదంతో విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉద్యోగులపై రాళ్లు పడితే వారిపైనే కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని అన్నారు.
అలా కేసులు పెట్టాల్సి వస్తే కెసిఆర్, కోదండరామ్‌లపై జీవితాంతం సరిపోయే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. నిజాం కళాశాలలో తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎందుకున్నాడని ఆయన అడిగారు. కళాశాల ప్రాంగణంలోకి రాళ్లు ఎలా వచ్చాయో తెరాస నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications