తడాఖా చూపిస్తా, నాకోసం జగన్ సాక్షిలో పేజీలు: బాబు

కాంగ్రెసు పార్టీ తొమ్మిదేళ్ల పానలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదే అన్నారు. యూపిఏ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో నేడు ప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తిపర్చిన తర్వాతనే విభజన జరగాలన్నారు. పాలన చేతకాకపోతే తప్పుకోవాలని హితవు పలికారు. దేశంలో అసమర్థ ప్రధాని ఉన్నారని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి అన్నారు. రూపాయి విలువ పడిపోవడంతో నిత్యవాసర వస్తువుల ధరలు పెరిగిపోయయన్నారు.
టిడిపి హయాంలో ప్రజలు ఎప్పుడు రోడ్డెక్కలేదని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలు ఎలాంటివైనా ఆరు నెలల్లో పరిష్కరిస్తానని బాబు చెప్పారు. మరో ఆరు నెలలు ఆగితే జాతకాలు బయటపడతాయని, కాంగ్రెసు పార్టీకి విభజన రాజకీయం వల్ల అనిశ్చితి నెలకొందని, కుట్రలు, కుతంత్రాలు ఆ పార్టీకి అలవాటే అన్నారు.
ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. రెండు ప్రాంతాల ప్రజలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక తన కోసం నాలుగు పేజీలు కేటాయించి, తప్పుడు వార్తలు ప్రచురిస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications