జగన్ కేసులో మూడు ఛార్జీషీట్స్: గడువు కోరే అవకాశం

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ మంగళవారం మూడు ఛార్జీషీట్స్ దాఖలు చేసింది. నాంపల్లి సిబిఐ జడ్జి సెలవులో ఉండటంతో గగన్ విహార్‌లోని సిబిఐ అదనపు కోర్టులో వేర్వేరుగా మూడు ఛార్జీషీట్లు దాఖలు చేశారు. త్వరలో మరో రెండు ఛార్జీషీట్స్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.

పెన్నా సిమెంట్స్, భారతి సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ కేసుల విచారణ పూర్తి కావడంతో సిబిఐ ఈ ఛార్జీషీట్స్ దాఖలు చేసింది. జగన్‌ను, విజయ సాయి రెడ్డిలను ప్రధా నిందితులుగా సిబిఐ పేర్కొంది. ఈ ఛార్జీషీట్స్‌లలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బిసిసిఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్‌ల పేర్లను ప్రస్తావించారు.

జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, కార్మెల్ ఏషియాలో ఇండియా సిమెంట్స్ రూ.140 కోట్లు, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియాలో పెన్నా సిమెంట్స్ రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా సిబిఐ అభియోగాలు మోపింది. ఈ మొత్తం పెట్టుబడులు ముడుపులే అని తేల్చింది. భారతి సిమెంట్స్‌లో నిమ్మగడ్డ రూ.244 కోట్లు, దాల్మియా సిమెంట్స్ రూ.98 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించింది.

గడువు కోరే అవకాశం - బెయిల్‌కు ఇబ్బంది

జగన్ కేసులకు సంబంధించి సిబిఐకి కోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదితో ముగిసింది. 8, 9వ తేదీలు సెలవు దినం కావడంతో సిబిఐ ఈ రోజు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. తుది ఛార్జీషీట్‌కు సిబిఐ మరింత గడువు కోరే అవకాశముంది. సిబిఐ మరోసారి గడువు కోరితే.. దానికి కోర్టులు అంగీకరిస్తే జగన్‌కు ఈ సెప్టెంబరులో కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కష్టసాధ్యమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+