కొత్త పార్టీయా: సిఎంపై బాబు, టికి కొత్త సిఎం: షబ్బీర్

విజయవాడ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పార్టీకే ఠికాణా లేదు కానీ కొత్త పార్టీ పెడతారట అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఎద్దేవా చేశారు. చంద్రబాబు కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఉన్న పార్టీకి ఠికాణా లేని ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడతాననడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల కిరణ్ కొత్త పార్టీ పెడతారంటూ జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కాంగ్రెసు పార్టీకి బ్రాంచ్ కార్యాలయాలుగా మారాయన్నారు. ఒకే కుటుంబం చేసిన లక్ష కోట్ల దోపిడీ వల్ల తెలుగు జాతి మొత్తాన్ని దొంగలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోకపోవడం దారుణమన్నారు.

Chandrababu Naidu

జనవరి, ఫిబ్రవరిల్లో తెలంగాణకు కొత్త సిఎం: షబ్బీర్ అలీ

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రానున్నారని శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ మంగళవారం అన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకే కాంగ్రెసు, కేంద్రం మొగ్గు చూపుతోందన్నారు. సీమాంధ్రులు ఎన్ని సదస్సులు పెట్టుకున్నా ఒరిగేదేం లేదన్నారు.

విద్వేషాలు రెచ్చగొట్టకండి: శ్రీనివాస్ గౌడ్

ఎపిఎన్జీవోలు, సీమాంధ్ర ప్రాంత నేతలు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ కోరారు. అందరు సంయమనం పాటించాలన్నారు. కాగా, సీమాంధ్ర బస్సులపై దాడి జరిగిన ఘటనపై ఎపిఎన్జీవోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+