సీమాంధ్ర, టీ మంత్రులకు సిఎం 'సమైక్య' డిన్నర్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మంగళవారం తెలంగాణ మంత్రులు కలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఇరు ప్రాంతాల మంత్రులు కలిసి చర్చించుకుంటే మంచిదని తెలంగాణ మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ఆ డిన్నర్ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై తెలంగాణవాదుల నుంచి వస్తున్న విమర్సలను కూడా తెలంగాణ మంత్రులు ప్రస్తావించారు.
ఎపి ఎన్జీవోల సమావేశానికి మీరే మద్దతు ఇచ్చారని, సీమాంధ్రకు అనుకూలంగా ఉన్నారని అందరూ అంటున్నారని సీఎంతో తెలంగాణ మంత్రులు అన్నారు. దీనిపై స్పందించిన కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న మాట వాస్తవమేనని, అలాగని సీమాంధ్రకు అనుకూలం కాదని, వారికి మద్దతు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సచివాలయానికి వచ్చారు.
ఆంద్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న తనకు అందరూ సమానమేనని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రులతో అన్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ వాదులు, నేతలు ఉద్యమాలు చేస్తుంటే మీరు వెళ్లి మద్దతు తెలిపారు కాదా అని తెలంగాణ మంత్రులను ఉద్దేశించి అన్నారు. "మీ మనోభావాలను అర్ధం చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏపీ ఎన్జీవోలు సమైక్యం కోరుతూ సభ పెట్టుకున్నారు. వాళ్ల మనోభావాలను అర్ధం చేసుకున్నాన"ని తెలంగాణ మంత్రులతో సీఎం అన్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతలపై కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఇరు ప్రాంతాల ఉద్యోగుల సమ్మె, శాంతిభద్రతలపై చర్చించారు. గణేష్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని జంట నగరాల్లో శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications