టిపై కిరణ్‌కి డికె అరుణ సూచన: ఆలోచించాలని పొన్నం

DK Aruna - Ponnam Prabhakar
హైదరాబాద్: తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నందున ఆ దిశలో ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని కోరుతామని మంత్రి డికె అరుణ మంగళవారం అన్నారు. రాష్ట్ర విభజన ఖాయమని ఆమె పునరుద్ఘాటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా విభజన ఆగే సమస్య లేదన్నారు.

విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నందున కిరణ్ చొరవ తీసుకొని ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరపాలన్నారు. కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర నేతగా కాకుండా ఇరు ప్రాంతాల వారితో చర్చించి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలన్నారు.

ముఖ్యమంత్రిని కలిసి సిడబ్ల్యూసి నిర్ణయానికి సహకరించాలని కోరుతామన్నారు. అందరితో తాము మాట్లాడేందుకు సిద్ధమన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తామందరం ప్రకటనలు చేశామని, ఇప్పుడు అలాగే కట్టుబడి ఉండాలన్నారు. విభజనపై వెనక్కి తగ్గేది లేదని అధిష్టానం రోజుకో ప్రకటన చేస్తోందని గుర్తు చేశారు. సీమాంధ్ర నేతలపై చర్యలకు తాము డిమాండ్ చేయమని, తెలంగాణ బిల్లు త్వరగా పెట్టాలని మాత్రమే కోరుతామన్నారు.

కలిసే ముందు ఆలోచించండి: పొన్నం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలనుకునే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నారని, అలాంటప్పుడు ఆయనను కలిచే విషయమై పునరాలోచించాలన్నారు.

తెలంగాణలో సీమాంధ్ర నాయకుల విగ్రహాలను ఎన్నింటినో పెట్టామని చెప్పారు. సీమాంధ్రలో తెలంగాణ వారి విగ్రహాలు ఉన్నాయా చెప్పాలని ప్రశ్నించారు. కలిసుందామంటూనే తెలంగాణ వారి పైన సీమాంధ్రులు దాడులు చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+