షాకిచ్చారు!: టి కాంగ్రెస్ నేతల సభలో మెరిసిన జెసి
హైదరాబాద్: మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు జెసి దివాకర్ రెడ్డికి మంగళవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు ఝలక్ ఇచ్చారట. టి కాంగ్రెసు నేతలు సిఎల్పీ కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సిడబ్ల్యూసి ప్రకటన తదనంతర పరిణామాల పైన, భవిష్యత్తు కార్యాచరణ పైన వారు చర్చించారు.
వారి సమావేశం జరుగుతుండగా జెసి దివాకర్ రెడ్డి భేటీ జరుగుతున్న గదిలోకి వెళ్లారు. ఈ సమయంలో ఆయన వారి వద్దకు వెళ్లి రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపాలని కోరారట. జై రాయల తెలంగాణ అని నినదించారట కూడా. అయితే, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మాత్రం రాయల తెలంగాణకు మద్దతిచ్చే ప్రసక్తి లేదని, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో అతను బయటకు వచ్చారట.

ముఖ్యమంత్రిని కలిసిన డికె అరుణ
మంత్రి డికె అరుణ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని యథావిథిగా అమలు చేయాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది.
15న టి కాంగ్రెసు నేతల విస్తృతస్థాయి సమావేశం
ఈ నెల 15వ తేదిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిసిసిబి అధ్యక్షులు, చైర్మన్లు పాల్గొననున్నారు. కాగా, బడ్జెట్ సమావేశాల్లో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి తెలంగాణపై అధిష్టానానికి సహకరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి కోరారు. కాంగ్రెసు వర్కింక్ కమిటీ నిర్ణయాన్ని యథావిథిగా అమలు చేయాలని కోరారు. త్వరలో కేబినెట్ నోట్ వస్తుందని ఎంపి మధుయాష్కీ అన్నారు.












Click it and Unblock the Notifications