'జై తెలంగాణ'కు గిఫ్ట్!, కెకె టీ పార్టీలో కెసిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: ఎపిఎన్జీవో సభలో తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన ఎపిఎన్జీవో సభలో శ్రీనివాస్ వేదిక ముందు జై తెలంగాణ నినాదాలు చేయడంతో ఆయనను తోటి పోలీసులు కొట్టిన విషయం తెలిసిందే.

కాగా, వారం రోజులకు పైగా ఢిల్లీ గడిపిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఆ పార్టీ సెక్రటరీ కె కేశవ రావు నివాసంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కె కేశవ రావు టీ పార్టీ ఇచ్చారు.

ఎపిఎన్జీవోల సభకు ధీటుగా టిఎన్జీవోలు సభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ స్వాభిమాన్ పేరుతో తెలంగాణ ఎన్జీవోల సభను తలపెట్టారు. అలాగే ఈ నెల 20న ఉద్యోగుల సభ, 25న కరీంనగర్‌లో తెరాస సభ, 30న ఓయులో విద్యార్థి ఐకాస సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

భేటీ

భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు నివాసంలో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఉద్యోగ సంఘ నేతలు.

చిరునవ్వు

చిరునవ్వు

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు నివాసంలో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పార్టీ నేత కడియం శ్రీహరి తదితరులు భేటీ

టి పార్టీ

టి పార్టీ

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు కె కేశవ రావు పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు, ఇతర నేతలకు టీ పార్టీ ఇచ్చారు.

టి తాగుతున్న కెసిఆర్

టి తాగుతున్న కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు కె కేశవ రావు ఇచ్చిన టీ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు టీ తాగుతున్న దృశ్యం.

భేటీకి హాజరైన వారు

భేటీకి హాజరైన వారు

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు కె కేశవ రావు ఇచ్చిన టీ పార్టీలో కెసిఆర్, కడియం శ్రీహరి సహా పలువురు నేతలు, ఉద్యోగ సంఘ నాయకులు.

హరీష్ రావు

హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు కె కేశవ రావు ఇచ్చిన టీ పార్టీలో తెరాస నేత హరీష్ రావు, ఎమ్మెల్సీ స్వామి గౌడ్ తదితరులు.

చెక్కు

చెక్కు

ఎపిఎన్జీవో సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు లక్ష రూపాయల చెక్కును ఇచ్చిన తెరాస మాజీ ఎంపి జితేందర్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+