ఆ పార్టీలదే బాధ్యత: మైసూరా, సమస్యపై టి కాంగ్ భేటీ

Mysoora Reddy
హైదరాబాద్: విభజన నిర్ణయం ప్రాంతీయ విద్వేషాల వంటి పరిణామాలకు దారి తీస్తే అందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే బాధ్యత వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మైసూరా రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.

మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చునన్నారు. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఎపిఎన్జీవోల బస్సుల పైన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. టిడిపి, కాంగ్రెసులు విభజనపై స్పష్టమైన విధానంతో ముందుకు రావాలన్నారు. లేదంటే ప్రాంతీయ విద్వేషాల పరిణామాలకు వారే బాధ్యులవుతారన్నారు.

తిరుమలకు మళ్లీ సమైక్య సెగ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరోసారి సమైక్య సెగ తగలనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో బస్సులు బంద్ చేయనున్నట్లు ఆర్టీసి ఐకాస ప్రకటించింది. తిరుపతి సమైక్య జెఏసి తన కార్యాచరణ ప్రకటించింది. బుధవారం నుండి విద్యాసంస్థలు బంద్ చేయాలని, 13న కేంద్ర కార్యాలయాలు ముట్టడించాలని, 14న తిరుపతికి విద్యుత్ నిలిపివేయాలని నిర్ణయించింది.

తెలంగాణ కాంగ్రెసు నేతల భేటీ

మరోవైపు విభజన సమస్య సానుకూల పరిష్కారానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు నడుంబిగించారు. సిడబ్ల్యూసి నిర్ణయం, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. సిడబ్ల్యూసి నిర్ణయానికి అనుగుణంగా సీమాంధ్రలో ఉద్యమాన్ని చల్లార్చేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలని వారు కోరనున్నారు. వారు సమావేశం అనంతరం ముఖ్యమంత్రిని కలువనున్నారు.

భేటీలో మంత్రులు డికె అరుణ, జానా రెడ్డి, గీతా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి, ఎంపిలు అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు భిక్షమయ్య గౌడ్, ఆమోస్, జగదీశ్వర్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆమోస్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+