విభజన: ఇక సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ

దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ అవినీతి ఎక్కువగా పెరిగిపోయిందని, కుటుంబ పాలన జరుగుతుందని, దీనిని వ్యతిరేకిస్తున్నామని విశ్వనాథ్ కొద్ది మంది మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ 41 రోజులుగా సీమాంధ్రలో సమ్మెలు, ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జరుగుతున్న ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ నేతలు లేరని, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు నడుపుతున్నారని డాక్టర్ విశ్వనాథ్ అన్నారు. 'సమైక్య రాష్ట్ర సమితి' పేరుతో పెడుతున్న పార్టీ ప్రజల కోసం పెడుతున్న పార్టీ అని, ప్రజలకే అంకితం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ బేడీతో పార్టీని ప్రారంభించే ఆలోచనలో విశ్వనాథ్ ఉన్నారు.
అపాయింట్‌మెంట్ కోరామని, ఇంకా సమాధానం రాలేదని రేపు (బుధవారం) అన్ని విషయాలు తెలియజేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర సమైక్యంగానే ఉంటుందని, సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీని స్థాపిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications